Sidda Raghavarao Resigns YSRCP: ప్రకాశం జిల్లాలో జగన్‌కు షాక్, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, కారణం ఏంటంటే..

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అంతకుమించి లేఖలో మరే విషయం ప్రస్తావించలేదు.

former-minister-sidda-raghavarao-resigns-ysrcp

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అంతకుమించి లేఖలో మరే విషయం ప్రస్తావించలేదు.

శిద్ధా రాఘవరావు 2014లో టీడీపీ కూటమి గెలిచినప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో శిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో శిద్ధా కుటుంబం కోరుకున్న దర్శి స్థానం దక్కకపోగా... అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను వైసీపీ నాయకత్వం ప్రతిపాదించింది. అయితే వీటి పట్ల శిద్ధా రాఘవరావు ఆసక్తి చూపించలేదు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement