CM YS Jagan Polavaram Tour: పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, కొనసాగుతున్న సీఎం జగన్ పోలవరం పర్యటన
కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ సర్కార్ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం పర్యటన కొనసాగుతోంది. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటించారు. సీఎంవెంట కేంద్ర మంత్రి షెకావత్‌తో పాటు, రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం ఇందుకూరు -1 కాలనీ ని ఏర్పాటు చేశారు. కాలనీ కి ఇప్పటికే 306 నిర్వాసిత కుటుంబాలు చేరుకున్నాయి. ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి నిర్వహించారు.
పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ సర్కార్ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)