Mudragada Padmanabham: రాజకీయ భవిష్యత్తుపై ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం, నన్ను తిహార్ జైలుకు తీసుకువెళ్ళేందుకు హెలికాప్టర్ సిద్దం చేశారని వెల్లడి

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు.

Mudragada Padmanabham (Photo-Twitter)

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు. తమ జాతి రిజర్వేషన్ జోకరు కార్డులా అయినందుకు భాధ పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదవారి కోసం నేను చేసే ఉద్యమాలు, వారి చిరునవ్వే నాకు ఆక్సిజన్. తుని ఘటన తరువాత నన్ను తిహార్ జైలుకు తీసుకువెళ్ళేందుకు హెలికాప్టర్ సిద్దం చేశారు. కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోమని.. అండర్ గ్రౌండ్‌కు వెళ్ళమని సలహాలు ఇచ్చారు. ఒకవేళ నేను అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం చులకనయ్యే ప్రమాదంలో పడేది. అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now