Corona in AP: ఏపీలో బాగా తగ్గిపోయిన కేసులు, కొత్తగా 117 మందికి మత్రమే కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 21,360 కరోనా పరీక్షలు నిర్వహించగా, 117 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 19 కేసులను గుర్తించారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 21,360 కరోనా పరీక్షలు నిర్వహించగా, 117 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 19 కేసులను గుర్తించారు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇక అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,095 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,52,718 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,961 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,416కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement