Corona in AP: ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదు

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.రాష్ట్ర వ్యాప్తంగా 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,371కి చేరుకుంది. మొత్తం 20,54,737 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,428 మంది మృతి చెందారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement