Corona in AP: ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు నమోదు, అత్యల్పంగా శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో 4 కేసులు
ఏపీలో గడచిన 24 గంటల్లో 50,304 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 168, గుంటూరు జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి.
ఏపీలో గడచిన 24 గంటల్లో 50,304 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 168, గుంటూరు జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో 4 కేసుల చొప్పున గుర్తించారు.
అదే సమయంలో 1,424 మంది ఆరోగ్యవంతులు కాగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,51,998 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,27,229 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,574 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,195కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)