Covid in AP: ఏపీలో కొత్తగా 94 మందికి కరోనా, మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 కు చేరుకున్న ఒమిక్రాన్ బాధితుల సంఖ్య

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 139 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,306 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,539 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,279 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,488కి పెరిగింది.

ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని.. వారి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాజా కేసులతో ఏపీలో ఒమిక్రాన్‌ సోకిన వారి సంఖ్య నాలుగుకి చేరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement