Ex Driver Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్‌ వేటు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది

MLC-Ananta-Babu

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు... తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనది’ అని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now