Narsapuram MPDO Death Case: ఏలూరు కాల్వలో లభ్యమైన నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణ మృతదేహం, వీడియో ఇదిగో..
తాజాగా ఆయన మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది.
వారం రోజుల నుండి కనపడకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణ కథ విషాదంగా ముగిసింది. తాజాగా ఆయన మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది. వారం రోజులుగా గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మధురానగర్ పైవంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహం కనిపించింది. ఆయన దూకిన ప్రదేశానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు.
విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో ఉండే వెంకటరమణారావు నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఆయన కానూరు వచ్చారు. 15న పని ఉందని, మచిలీపట్టణం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని, అందరూ జాగ్రత్త అని మెసేజ్ పెట్టి సెల్ ఆఫ్ చేశారు. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సూసైడ్ లెటర్
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మచిలీపట్టణం, విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన వాహనం మచిలీపట్టణం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ. 54 లక్షల బకాయిలు ఉండడమే కారణమని గుర్తించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)