Andhra Pradesh: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి అయోగ్ సదస్సు, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన సీఎం జగన్
సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం జగన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)ల ద్వారా అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి. నేచురల్ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి’’ అని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీకేలపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు నిజయంగా అభినందనీయమని తెలిపారు.
సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు. ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్. #YSRCP #CMYSJagan #NitiAayog pic.twitter.com/cE1dD5F20V