Sanjeev Kumar Resigns to YCP: కర్నూలులో వైసీపీకీ మరో బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, త్వరలో టీడీపీలో చేరే అవకాశం
ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్ కుమార్ తెలిపారు.
ఏపీలో వైసీపీకీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్ కుమార్ తెలిపారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా.
వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలి. అపాయింట్‌మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటా’’ అని వివరించారు. కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి సంజీవ్ కుమార్‌ను తప్పించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కర్నూల్ ఎంపీగా గుమ్మనూరు జయరాం ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అసంతృప్తికి గురైన సంజీవ్ కుమార్ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)