Roja Counter to Lokesh: పప్పు ఇది చెప్పు అంటూ నారా లోకేష్‌కు కౌంటర్ విసిరిన మంత్రి రోజా, జగన్ ప్రమాణం చేయాలంటూ సవాల్ చేసిన లోకేష్

ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేసిన నారా లోకేష్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. అంతకు ముందు మాజీ మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

MLA Roja (Photo-Twitter)

ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేసిన నారా లోకేష్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. అంతకు ముందు మాజీ మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమల వెళ్తున్న సీఎం జగన్‌.. ఈ విషయంపై అక్కడ ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు.

వివేకా హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్‌ హత్యతో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధమా? ప్రమాణం చేయకపోతే గొడ్డలి పోటు జగనాసుర రక్తచరిత్ర అని ఒప్పుకొంటారా?’’ అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

నారా లోకేష్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..

అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు?

క్షుద్ర పూజలు చేయించిందెవరు?

40 గుడులను కూల్చేసింది ఎవరు?

సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు?

అంతర్వేది రథం తగలబెట్టిందెవరు?

రాముడి విగ్రహం విరిచేసిందెవరు?

నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు.’ అంటూ కామెంట్స్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now