AP Assembly Elections 2024: మళ్లీ జగన్ సర్కారుదే అధికారం, నవరత్నాలే కారణం, సినీ నటుడు సుమన్ ఆసక్తిర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్ చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేయనున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని వారే చెబుతున్నారని తెలిపారు. నవరత్న పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)