Vijayawada Floods: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజీ రైల్వే పైబ్రిడ్జిని తాకిన కృష్ణమ్మ, 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో వరద, 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం
ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది
Vjy, Sep 2: ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది. అంతకుముందు 2009 సంవత్సరం అక్టోబర్ 5 న రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కుల వరదనీరు, 1903 అక్టోబర్ 7లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలోని రైల్వే బ్రిడ్జిని కృష్ణానది జలాలు దాదాపు తాకాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రకాశం బ్యారేజీకి 11,37,426 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)