Andhra Pradesh: మార్గదర్శి సహా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో అధికారులు సోదాలు, సోదాల్లో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపిన రిజిస్ట్రేషన్ స్టాంపు అధికారులు

రాష్ట్రంలో 18 చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యూనిట్లలో అధికారులు సోదాలు జరిపారు. ఇప్పటికే 2 దశల్లో చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలలో తనిఖీలు జరపగా.. ఈ సోదాల్లో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు.

Stamps and Registration Officers Searches were conducted in chit fund and finance companies including Margadarshi (Photo-Video Grab)

ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి సహా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్ స్టాంపు అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో 18 చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యూనిట్లలో అధికారులు సోదాలు జరిపారు. ఇప్పటికే 2 దశల్లో చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలలో తనిఖీలు జరపగా.. ఈ సోదాల్లో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు.

ప్రధానంగా చిట్స్‌ ద్వారా వసూలు చేసిన డబ్బు చిట్‌ఫండేతర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని గుర్తించిన అధికారులు తనిఖీలు చేపట్టారు . చిట్‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్లుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినట్లుగా గుర్తించారు. రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని గుర్తించిన అధికారులు.. అనుమతులు లేకుండా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)