Andhra Pradesh: సీఎం జగన్‌తో మిచౌంగ్‌ తుపాను కేంద్ర బృందం భేటీ,పంట నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

CM Jagan Meeting with central government officials formed on cyclone damage and drought estimates

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర బృందం చర్చించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం.. తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు.

మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కేంద్రం బృందం పేర్కొంది.

Here's AP CMO Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement