Andhra Pradesh: వీడియో ఇదిగో, నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు, నిజం తెలిసి తల పట్టుకున్న షాపు యజమాని

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Udayagiri Women gave fake gold and stole real gold (Photo-Video Grab/X)

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో గురువారం ఉదయం 32 గ్రాముల నకిలీ బంగారపు గొలుసు ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్నారు.

వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో కుప్పకూలిన ప్రయాణికురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్, సోషల్ మీడియాలో ప్రశంసలు

అయితే జ్యుయెల్లరీ షాపు వాళ్లు అది అసలు బంగారం అని భావించి మోసపోయారు. ఆపై అది నకిలీ బంగారం అని తెలిసి తలపట్టుకున్నారు. దీంతో వెంటనే షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి తెలివిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now