Union Minister Mansukh Mandaviya Meet CM Jagan: ఏపీలో వైద్య రంగం అద్భుతం, సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపిన కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సీఎం జగన్‌తో భేటీ

ఏపీ సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Union Minister Mansukh Mandaviya Meet CM Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మాండవీయ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహుకరించారు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేష్ అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజలతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

మన్సుఖ్ మాండవీయ ఇవాళ విజయవాడ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజని, టీడీపీ ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Here's CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ