Andhra Pradesh: షాకింగ్ వీడియో, టీడీపీ నేతను కత్తితో నరికేందుకు ప్రయత్నించిన దుండగుడు, భవాని మాల వేషంలో భిక్ష తీసుకుంటున్నట్లుగా నటిస్తూ దాడి

ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు.

unknown-person-attacks-tdp-leader Former MPP Polnati Seshagiri Rao in-tuni (Photo-Video Grab)

ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలో అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement