Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌, జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ప్రశంసలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అభినందించిన జెన్నిఫర్‌. జీడీపీ గ్రోత్‌ రేట్‌ లో నెంబర్‌ వన్‌ గా ఉండడాన్ని అభినందించిన జెన్నిఫర్‌. ఏపీలో పెట్టుబడులకు సహకారం అందించాలని కోరిన సీఎం.

CM-YS-JAGAN_1

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ బుధవారం కలిశారు. కొత్త రాష్ట్రమైనా, ఆర్థిక ఇబ్బందులున్నా.. కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా చేశారని సీఎంను జెన్నిఫర్‌ అభినందించారు. జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ఆమె ప్రశంసించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని సీఎం పేర్కొన్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement