MP Vijaysai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి, సీఎం జగన్ కు రుణపడి ఉంటానని తెలిపిన వైఎస్సార్సీపీ ఎంపీ
ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
వైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్‌ఖడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)