Vontimitta Sita Rama Kalyanam: ఏప్రిల్ 26 న ఒంటిమిట్టకు వైయస్ జగన్, కోదండ రాముడి కల్యాణానికి హాజరు కానున్న ఏపీ సీఎం, ఈ నెల 21 నుంచి 29 వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 26 న కడప జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం కు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఇందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోదండ రాముడి కల్యాణం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు కల్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 5 వేల మందికి కల్యాణోత్సవ పాసులు జారీ చేస్తామన్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)