AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల ఆందోళన.. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసన.. 15 నిమిషాల్లోనే సభ వాయిదా

ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

AP Assembly Sessions 2023 (Photo-X)

Vijayawada, Sep 22: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Session) గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ (Arrest) పై టీడీపీ సభ్యలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని, మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏమాత్రం తగ్గని టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనను కొనసాగించారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని స్పీకర్ పదేపదే చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో, సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు