Thalliki Vandanam: స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు, రూ.9,407 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు
మరో సూపర్ సిక్స్ హామీ అమలు చేసే దిశగా తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలకు ఈ పధకం వర్తిస్తుందన్నారు.
ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. మరో సూపర్ సిక్స్ హామీ అమలు చేసే దిశగా తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలకు ఈ పధకం వర్తిస్తుందన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమచేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు కేటాయించారు.
స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)