Raghu Rama Krishnam Raju: విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ నాకు నోటీసులు పంపింది, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపిన ఎంపీ రఘురామ
సీఐడీ నోటీసులకు తాను ఈ నెల 16న సమాధానం ఇచ్చానని చెప్పారు.
విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. సీఐడీ నోటీసులకు తాను ఈ నెల 16న సమాధానం ఇచ్చానని చెప్పారు. తనతో పాటు హైదరాబాద్ లో ఉన్న రెండు ప్రముఖ వార్తా ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ... తనకు మాత్రమే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇదే విషయాన్ని సీఐడీకి ఇచ్చిన సమాధానంలో తాను చెప్పానని అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపానని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)