Babu-Pawan Swearing: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ (వీడియోలతో)

ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.

Pawan Kalyan (Credits: X)

Vijayawada, June 21: ఏపీ శాసనసభ సమావేశాలు (AP Assembly) శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu) ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. చంద్రబాబు, పవన్ ప్రమాణం చేస్తున్న వీడియోలను కింద చూడొచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement