Andhra Pradesh: దేవరపల్లి ప్రమాదంపై సీఎం చంద్రబాబు, జగన్ దిగ్బ్రాంతి..బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటన

జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.

AP CM Chandrababu, YS Jagan on Devarapalli road accident

Vij, Sep 11: తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.

ఈ ఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. లారీలోని వారు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.  కొడాలి నానిపై కేసు పెట్టిన ఆలూరు టిడిపి నేతలు, చంద్రబాబుని లోఫర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు 

Here's Tweet:

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు