YSR's 73rd Birth Anniversary: వీడియో.. వైఎస్సార్ 73వ జయంతి, నివాళి అర్పించిన సీఎం జగన్, విజయమ్మ, షర్మిల, ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మత పెద్దలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్, భారతి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, షర్మిల కూతురు, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

YSR's 73rd Birth Anniversary

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్, భారతి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, షర్మిల కూతురు, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సమాధి వద్ద మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మరోవైపు వైఎస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన వైఎస్... ఒక్క రూపాయికే వైద్యం చేసి, రూపాయి డాక్టర్ గా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి ఎరుగని నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తన పూర్తి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వైఎస్... ఆ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలను చేపట్టారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు