AP Budget Highlights: మత్య్సకారులకు గుడ్ న్యూస్, చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు

Payyavula Keshav minister Photo-AP CMO)

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

సూపర్ సిక్స్ హామీల అమలు బడ్జెట్ ఇదిగో, పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు, వ్యవసాయ రంగానికి పెద్ద పీట

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, చేపల వేట నిషేధ సమయంలో, మత్య్సకారులకు అందించే ఆర్ధిక సహాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు కేటాయించనున్నారు. అలాగే ఆదరణ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది.

చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now