Gudivada Amarnath: ఏపీ భవన్‌లో అధికారిని ఎలా తన్నావో గుర్తుకు తెచ్చుకో, తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర మంత్రి హరీశ్ రావులను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అమర్‌నాథ్ అన్నారు. గడచిన మూడేళ్లలోనే ఏపీకి తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసునని కూడా ఆయన అన్నారు.
ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి వరుసగా కౌంటర్లు పడుతున్నాయి. హరీశ్ రావు వ్యాఖ్యలపై గంటల వ్యవధిలోనే ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు.
ఏపీపై తెలంగాణకు చెందిన నేతల విమర్శలు సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర మంత్రి హరీశ్ రావులను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అమర్‌నాథ్ అన్నారు. గడచిన మూడేళ్లలోనే ఏపీకి తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసునని కూడా ఆయన అన్నారు. 8 ఏళ్లలో సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ భవన్‌లో అధికారిని హరీశ్ రావు ఎలా తన్నారో అందరూ చూశారని ఆయన ఎద్దేవా చేశారు. హరీశ్ రావు, కేసీఆర్‌ల మధ్య గొడవలు ఉంటే వాళ్లే చూసుకోవాలని కూడా అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)