Fact Check: ఆ డ్రైవర్ ఉద్యోగం తొలగించలేదు, క్లారిటీ ఇచ్చిన APSRTC, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఆయనతో షేక్ హ్యాండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ జాబ్ తీసేసారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.అయితే ఏపీఎస్‌ఆర్టీసీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించామనడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు

APSRTC Driver Shake Hand with Nara Lokesh (Photo-Twitter)

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఆయనతో షేక్ హ్యాండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ జాబ్ తీసేసారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.అయితే ఏపీఎస్‌ఆర్టీసీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించామనడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్రగా సాగుతున్న నారా లోకేశ్ కు ఆర్టీసీ బస్ ఎదురైంది. అందులో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు లోకేశ్ తో కరచాలనం చేశారు. డ్రైవర్ షేక్ హ్యాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ డ్రైవర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని ప్రచారం మొదలైంది. తనకు మద్దతు తెలిపినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని నారా లోకేశ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.

Here's APSRTC Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా

Share Now