Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ
ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజరాత్ కు శాంపిల్స్ పంపగా… వచ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు చూపించారు.
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదంపై ఏపీలో రాజకీయ వివాదం నడుస్తోంది. తాజాగా ఆ నెయ్యిలో ఉన్నవి జంతువుల కొవ్వుతో తయారైన పదార్థాలని, ఫిష్ ఆయిల్ తో పాటు మైదా సహా ఇంకా ఏం పదార్థాలున్నాయో ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును టీడీపీ బయటపెట్టింది. ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజరాత్ కు శాంపిల్స్ పంపగా… వచ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు చూపించారు.వెంకన్నతో ఆటలాడితే శిక్ష తప్పదని, వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డి, భూమన, వైఎస్ జగన్ లను ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని మండిపడ్డారు.
దీన్ని మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన ఖండించారు. తాను కుటుంబంతో సహా శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తానని ప్రకటించగా… ఇది రాజకీయం అంటూ భూమన పాత పాటే పాడారు. తిరుమలను రాజకీయం కోసం వాడుకోవటం ఒక ఎత్తైతే, నెయ్యిలో కల్తీ చేస్తూ ఇంతకు దిగజారుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇవి రాజకీయ ఆరోపణలు మాత్రమే అంటూ వైసీపీ కామెంట్ చేసింది.
Here's TDP Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)