Police Case On YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు... గుంటూరు పర్యటనలో భారీగా ట్రాఫిక్ జాం, రైతులు ఇబ్బందులు పడ్డారని పోలీస్ కేసు నమోదు
వైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది . గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
వైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది(Police Case On YS Jagan). గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా దానిని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు పోలీసులు.
జగన్ తో(YS Jagan) పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలు నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారని(Guntur Mirchi Yard).. మిర్చి యార్డులోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులు కేసు నమోదు చేశారు.
Case registered against former CM YS Jagan
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)