YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా దస్తగిరి పేరు తొలగింపు, సాక్షిగా పరిగణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీబీఐ కోర్టు
తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని, సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ 4వ నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని, సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను సాక్షిగా చేర్చినట్టు కోర్టుకు తెలిపారు. దస్తగిరి తరఫు న్యాయవాది వాదనను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్టు తెలిపింది.సాక్షిగా పరిగణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెడతామని స్పష్టం
Here's News