Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Credits: X

Vijayawada, Sep 10: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill Development Scam) కేసుకు సంబంధించి విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టులో (ACB Court) విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రాజకీయ లబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం, తనను అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now