Chandrababu Health Update: ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు, టీడీపీ అధినేతకు వైద్య పరీక్షలు పూర్తి
టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చంద్రబాబు ఒక రోజు పాటు ఏఐజీ ఆస్పత్రిలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. AIG ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత LV ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు, చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ, మొత్తం నలుగురి టీడీపీ నేతలపై కేసు నమోదు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)