chandrababu (Photo-TDP-Twitter)

Vjy, Nov 2: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

చంద్రబాబు ర్యాలీ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాక్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదు

ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి ఘటన అప్పట్లో సంచలనం రేపిన సంగతి విదితమే. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు.ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగా స్పందించలేదనే వాదనలు ఉన్నాయి. చింతమనేనిపై కేసు పెట్టకుండా ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నం చేసినట్లు సమాచారం.