CM Jagan Konaseema Tour: సీఎం జగన్ జేబులో పెన్ను తీసుకున్న బాలుడు, వెంటనే తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వదించిన ఏపీ ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
గమనించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.. 8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వదించాడు.
వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. డా.బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకోంది. పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఆమె కుమారుడిని సీఎం వైయస్ జగన్ చంకనెత్తుకోగా..అ బాలుడు సీఎం జేబులోని పెన్ను తీసుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.. 8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వదించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అలాగే శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం వైయస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని ప్రశ్నించారు. వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎం వైయస్ జగన్‌కు వరద బాధితులు సమాధానం చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)