Collector Gandham Chandrudu: మండుటెండలో చెప్పుల్లేకుండా పలుగు పార పట్టిన కలెక్టర్ గంధం చంద్రుడు, ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్

చెప్పులేసుకోకుండా మండుటెండలో గడ్డపార చేతపట్టి మట్టి తవ్వతూ కూలీల్లో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్సాహం నింపారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన ఇవాళ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.ఆత్మకూరు మండలం వడ్డిపల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్ (Collector Gandham Chandrudu) కూలీలను అడిగి పలు అంశాలపై ఆరా తీశారు. పనులు (MGNREGA Work in Anantapur) ప్రతి రోజు కల్పిస్తున్నారా ?, క్రమం తప్పకుండా డబ్బులు అందిస్తున్నారా? అని కూలీలను అడిగారు. అనంతరం కూలీల్లో ఉత్సాహం నింపేందుకు పలుగుపార చేతబట్టి ఉపాధి పనులు చేశారు.

Anantapur Collector Gandham Chandrudu (Photo-Twitter)

భీమ్ దీక్ష చేస్తున్న కలెక్టర్ కాళ్లకు చెప్పులు లేకుండానే నీలం చొక్కా ధరించి పనులు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మరికొంత మంది పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 2లక్షల 30వేల మంది పని చేస్తున్నారని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఆరున్నర లక్షల మందికి పని కల్పించి.. దేశంలో ఒక రికార్డు సృష్టించామన్నారు. వేసవి కాలం, కోవిడ్ నేపథ్యంలో కూలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.

Here's Gandham Chandrudu Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now