Cylinders blast in Nadnyal: సిలిండర్ల పేలుళ్లతో దద్దరిల్లిన నంద్యాల, హోటల్ మూసి ఉండడంతో తప్పిన ప్రాణాపాయం, మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది, 15 వరకు సిలిండర్లు బ్లాస్ట్

నంద్యాల నగరం సిలిండర్ల పేలుళ్లతో దద్ధరిల్లింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం (Cylinder blast in Nadnyal) తప్పింది. కర్నూలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే నంద్యాల చెక్ పోస్టు దగ్గర హోటల్లో సిలిండర్ల పేలుళ్లు (Cylinder Blast) బీభీత్సం సృష్టించింది. మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్డాలు, మంటలను చూసిన జనం ఎం జరుగుతుందో అర్థం కాక ప్రాణ భయంతో పరుగులు తీశారు.

Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

హోటల్‌లో సిలిండర్లు పేలడంతో వస్తువులు పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఇళ్లపై ఎగిరి పడ్డాయి. ప్రమాద సమయంలో హోటల్ మూసి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. పేలకుండా ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక హోటల్‌లో 15 వరకు సిలిండర్లు ఉండడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. హోటల్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now