Fact Check: జగనన్న అమ్మఒడి రద్దు..ఈ న్యూస్ అంతా ఫేక్, అధికారికంగా క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, అటువంటి వారిపై సైబర్ క్రైం చర్యలు తీసుకుంటుందని వెల్లడి
వీటిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అటువంటి ఖాతాలను గుర్తించి సైబర్ క్రైం చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం రద్దు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అటువంటి ఖాతాలను గుర్తించి సైబర్ క్రైం చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. పథకం రద్దు చేయబడిందనే ప్రచారం పెరగడంతో ప్రజలకు నిజాలు చెప్పడానికి ప్రభుత్వం ఈ సర్క్యూలర్‌ను విడుదల చేసింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మవడి నిబంధనలను మార్పు చేసింది. 300 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించినా, ప్రభుత్వం ఇచ్చిన కొత్త రైస్ కార్డు లేకపోయినా, కొత్త జిల్లాల ప్రకారం ఆధార్ కార్డులో మార్పులతో పాటు 75శాతం హాజరు నమోదు ఉండాలని స్పష్టం చేసింది. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తేడాలున్నా పథకం వర్తించదని తెలిపింది.
అమ్మఒడి పథకంలో ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలంటే నిబంధనలు విధించింది. లబ్దిదారులు 2022 ఏడాదికి ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ చేయాలి. చైల్డ్ ఇన్ఫోలో ఉన్న తల్లి ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతాను నమోదు చేయాలని తెలిపింది. ఆధార్‌కి మొబైల్ లింక్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఎన్పీసీఐ మ్యాప్ అయిన ఖాతాలో మాత్రమే నగదు పడుతుంది. బ్యాంకుకి వెళ్లి ఎంపీటీసీ మ్యాప్ చేసుకోల్సి ఉంటుంది.
హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి, విద్యార్థి ఓకే మ్యాపింగ్‌లో ఉండాలి. వివరాలు వాలంటీర్ వద్ద ఉండే యాప్‌తో సరి చూసుకోవాల్సి ఉంటుంది. అందులో వివరాలు తప్పుగా ఉంటే వాలంటీర్ యాప్ హెచ్ హెచ్ మ్యాపింగ్ ద్వారా ఈకేవైసీ అప్ డేట్ చేసి.. సరిచేయాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే..? హాజురు శాతం 75 కన్నా తక్కువ ఉండొద్దు. దీని ప్రకారం నవంబర్ 8వ తేదీ 2021 నుంచి ఏప్రిల్ 30 2022 వరకు పరిగణలోకి తీసుకుంటారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)