Fact Check: నిర్దిష్ట వైద్య పరిస్థితులు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు, సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

మెడికల్ కండిషన్ బాగాలేని ఓ చిన్నారికి ప్రభుత్వం ఉతీర్ణత మార్కులు వేస్తుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తన ట్విట్టర్ పేజీ FactCheck.AP.Gov.inలో క్లారిటీ ఇచ్చింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీ పదవతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత (Manabadi result out 67.27% pass) సాధించారు. అయితే పదవతరగతి పరీక్షా ఫలితాలపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన ట్విట్టర్ పేజీ FactCheck.AP.Gov.inలో క్లారిటీ ఇచ్చింది.

మార్కుల మార్గదర్శకాల ప్రకారం, నిర్దిష్ట వైద్య పరిస్థితులు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు మంజూరు చేయబడతాయి.చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడం శోచనీయం. దయచేసి తప్పుదారి పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు ధృవీకరించండి అని తెలిపింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)