Fibernet Case: ఫైబర్ నెట్ కేసు, చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేయడంతో కోర్టు నిర్ణయం వాయిదా పడింది.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈలోగా టీడీపీ అధినేతను అరెస్ట్ చేయవద్దని కూడా సీఐడీ తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)