Fact Check on Floating Bridge Washed Away: విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందనేది అబద్దం, తప్పుడు ప్రచారాన్ని ఖండించిన VMRDA, అలల ఉధృతి అధికంగా ఉంటే జాయింట్ తొలగింపు చేస్తామని క్లారిటీ

బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో సృష్టించిన కథనాలన్నీ ఫేక్ అని VMRDA క్లారిటీ ఇచ్చింది . ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణలో భాగంగా జరిగిన మాక్ డ్రిల్ అది అని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ (VMRDA) కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Floating Bridge Washed Away

బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో సృష్టించిన కథనాలన్నీ ఫేక్ అని VMRDA క్లారిటీ ఇచ్చింది . ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణలో భాగంగా జరిగిన మాక్ డ్రిల్ అది అని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ (VMRDA) కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారాన్ని ఆయన ఖండించారు. దీనిపై వైసీపీ పార్టీ కూడా ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ఒక్కరోజుకే తెగిపొయిన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, సందర్శకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, వైసీపీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

వైజాగ్ ఆర్కే బీచ్ లో నిర్వహణ పరంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి ర్యాంప్ జాయింట్ తొలగించిన సిబ్బంది. అధిక వేగంగా అలలు వచ్చేటప్పుడు ఈ తరహాలో తొలగింపు చేయకుంటే ప్రమాదాలకు ఆస్కారం. నిర్వహణ పరమైన మార్పు పై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి కొట్టుకుపోయింది అన్న ప్రచారాన్ని ఖండించిన VMRDA. ఎప్పుడైనా అలల ఉధృతి అధికంగా ఉంటే జాయింట్ తొలగింపు చేస్తామంటూ ట్వీట్ చేసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement