IPL Auction 2025 Live

Former Dharmavaram MLA Nagireddy Dies: కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత, ధర్మవరం నియోజకవర్గానికి మూడు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు

పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

RIP

కోవిడ్ బారీన పడి మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) (Former MP Nagireddy Dies) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు.

తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్‌ ఇచ్చారు. మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్‌రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Here,s Updates

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు