Andhra Pradesh CS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ నియామకం, ఉత్తర్వులు విడుదల చేసిన జగన్ ప్రభుత్వం, అక్టోబర్ 1 నుంచి బాధ్యతల స్వీకరణ

Govt. of Andhra Pradesh | Photo: FB

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన IAS సమీర్‌ శర్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు.  ప్రస్తుతం ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 1 నుంచి నూతన సీఎస్ గా  సమీర్‌ శర్మ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now