Visakh Refinery Expansion: ఏపీకి గుడ్ న్యూస్..విశాఖ రిఫైన‌రీ ఆధునికీక‌ర‌ణ‌ వ్యయం రూ.26,264 కోట్ల‌కు పెంచుతూ కేంద్రం కీలక ప్ర‌క‌ట‌న‌, రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజయ సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన కేంద్రం

అయితే తాజాగా ఈ వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరిస్తున్నట్లు సోమ‌వారం కేంద్ర పెట్రోలియం శాఖ స‌హాయ మంత్రి రామేశ్వ‌ర్ తెలిపారు.

YSRCP MP Vijaya Sai Reddy (Photo | @VSReddy_MP/Twitter)

పార్లమెంటు బ‌డ్జెట్ మ‌లి విడ‌త స‌మావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన చాలా అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి.చాలా అంశాల్లో తెలుగు రాష్ట్రాలు కోరిన‌ట్టుగా కేంద్రం ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తోంది. ఇందులో భాగంగా సోమ‌వారం నాటి రాజ్య‌స‌భ స‌మావేశాల్లో ఏపీకి చెందిన ఓ అంశానికి సంబంధించి నిధులను పెంచుతూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విశాఖ ప‌రిధిలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఆధునికీకరణకు (Visakh Refinery Expansion) రూ.20,928 కోట్ల మేర వ్య‌యం అవుతుంద‌ని గ‌తంలో కేంద్రం అంచ‌నా వేసింది. అయితే తాజాగా ఈ వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరిస్తున్నట్లు సోమ‌వారం కేంద్ర పెట్రోలియం శాఖ స‌హాయ మంత్రి రామేశ్వ‌ర్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేర‌కు జవాబిచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)