Anand Mahindra Wishes to Chandrababu: ఏపీ కొత్త సీఎం చంద్రబాబుకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్రా, ట్వీట్ ఇదిగో..

ఆయన ట్వీట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అని తెలిపారు.

Indian Business tycoon Anand Mahindra Wishes in Telugu to Chandrababu Naidu Take Oath Andhra Pradesh CM

Anand Mahindra Wishes in Telugu to Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.సందర్భంగా చంద్రబాబుకు ఎక్స్ వేదికగా పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఇండియన్ బిజినెస్ టైకూన్ మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా చంద్రబాబుకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అని తెలిపారు.  వీడియో ఇదిగో.. చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను..4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం

Here's Anand Mahindra Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)