Owaisi on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని ఒవైసీ పిలుపు, జగన్ పాలన చాలా బాగుందని ప్రశంసలు
చంద్రబాబు అరెస్ట్ మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు.
![Owaisi on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని ఒవైసీ పిలుపు, జగన్ పాలన చాలా బాగుందని ప్రశంసలు](https://test1.latestly.com/wp-content/uploads/2023/09/101-1024x576.jpg)
చంద్రబాబు అరెస్ట్ మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసునన్న అసద్.. ప్రజలు కూడా ఆయనను నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఏపీలో రెండే పార్టీలు అధికారంలో ఉన్నాయని, ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీ అని తాము వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు.ముఖ్యమంత్రి జగన్ మంచి పాలనను అందిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు పనిచేయాల్సి ఉందని అసద్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను వేధిస్తున్న బీఆర్ఎస్ నేతలను గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. తమతో మంచిగా ఉంటే చేయి ఇస్తామని, అలాగని స్నేహం పేరుతో మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు తమ మద్దతు ఉంటుదన్న అసద్ కేసీఆర్ తెలంగాణలో మంచి పాలన అందిస్తున్నాడని తెలిపారు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2023/09/101.jpg)
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)