Pawan Interested Deputy CM Post: ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తి.. ఇండియా టుడే ఛానల్ లో స్క్రోలింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్ ఆసక్తితో ఉన్నారా? ఇండియా టుడే ఛానల్ ఆదివారం వేసిన ఓ స్క్రోలింగ్ ఈ వాదనకు బలం చేకూరుతుంది.
Vijayawada, June 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM Post) పదవి తీసుకునేందుకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తితో ఉన్నారా? ఇండియా టుడే ఛానల్ ఆదివారం వేసిన ఓ స్క్రోలింగ్ ఈ వాదనకు బలం చేకూరుతుంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖతతో ఉన్నట్టు పవన్ పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్ లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)